తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 27 -- బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నాన్ - అకడమిక్ కోటాలోని సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు రేపటితో(ఫిబ్రవరి 25) పూర్తి కానుంది. అర్హులైన వారు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 75 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హులైన వారు. ఫిబ్రవరి 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాలి.

ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఆన్ లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫిటెట్, విద్యా అర్హత ధ్రువపత్రాలు, ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన పత్రాలు. యూజీ, పీజీ రిజిస్ట్రేషన్ ...