భారతదేశం, డిసెంబర్ 4 -- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐబీఈ - 20 ప్రాథమిక కీ వచ్చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు allindiabarexamination.com వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 4 సెట్ల జవాబులు ఇందులో ఉంటాయి.

ప్రాథమిక కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే పంపొచ్చు. ఇందుకు డిసెంబర్ 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. సరైనా ఆధారాలతో అభ్యంతరాలను పంపాలని అధికారులు సూచించారు.

ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో AIBE - 20 బార్ పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు సింగిల్ షిఫ్టులో పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు విశాఖ, తిరుపతి, విజయవాడలోనూ ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి.

ఆలిండియా బార్ ఎగ్జామినేషన్​లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించ...