భారతదేశం, జనవరి 7 -- న్యూఢిల్లీ, జనవరి 7, 2026: దేశవ్యాప్తంగా న్యాయవాద వృత్తిని చేపట్టాలనుకునే వారు రాసే 'ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్' (AIBE-XX) ఫలితాలు వెలువడ్డాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) బుధవారం ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్ allindiabarexamination.com లో చూడవచ్చు.

గతేడాది నవంబర్ 30న దేశంలోని 56 నగరాల్లో జరిగిన ఈ పరీక్షకు భారీ స్పందన లభించింది.

కేటగిరీల వారీగా చూస్తే.. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలో 90,111 మంది, ఓబీసీలో 53,513 మంది, ఎస్సీ కేటగిరీలో 25,290 మంది, ఎస్టీ కేటగిరీలో 5,472 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

పరీక్ష తర్వాత అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. "ప్రశ్నాపత్రంలోని 100 ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలు తప్పు...