ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, ఏప్రిల్ 4 -- ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామినేషన్​ (ఏఐబీఈ 19) ఫలితాలకు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఓఎంఆర్ పునఃపరిశీలనకు అవకాశం కల్పించారు. ఇందుకోసం రూ. 500 చెల్లించి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు.

ఇందుకోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఓఎంఆర్ ను మరోసారి పరిశీలిస్తారు. ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే పరిశీలించి. ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఫలితాలను వెబ్ సైట్ లో కూడా అభ్యర్థి మెయిల్ కు పంపిస్తారు. ఆఫ్ లైన్ విధానంలో కూడా ఆన్ లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు ఇందుకు అవకాశం కల్పించారు.

ఈ పరీక్షను గతేడాది డిసెంబర్ 22వ తేదీన నిర్వహించారు. ఆ వెంటనే ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఆ తర్వాత మార్చి 6వ తేదీన ఫైనల్ కీని ప్రకటించారు...