Hyderabad, ఫిబ్రవరి 21 -- వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో కృత్రిమ మేధస్సు (ఏఐ)పై ఎంతోమంది ఆధారపడుతున్నారు. ChatGPT అనేది అత్యంత ఫేమస్ జనరేటివ్ ఏఐ సాధనాలలో ఒకటి. ఇది ఏ ప్రశ్నకైనా తగిన సమాధానాలను ఉచితంగా ఇస్తుంది. ఎక్కువమంది వారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి, సూచనలు తీసుకోవడానికి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను వాడతారు.

అయితే అది ఇచ్చే సమాధానాలు కచ్చితంగా సరైనవి అని చెప్పలేము. ఆరోగ్య సలహా కోసం చాట్ జిపిటి, జెమిని వంటి వాటిపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరం. అనవసరమైన ఆందోళనను ఇది పెంచుతుంది. ఆరోగ్య సలహాల కోసం వైద్యులను సంప్రదించాలి.

ఆరోగ్య ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి చాట్ జిపిటిని ఉపయోగించారా అని జూన్ 2024 లో 2,000 మందికి పైగా ఆస్ట్రేలియన్లను సర్వే చేశారు. ప్రతి పది మందిలో ఒకరు చాట్ జీపీటీని ఆరోగ్య ప్రశ్న అడిగారు. వారు చాట్ జీపీటీ ...