భారతదేశం, ఫిబ్రవరి 27 -- AI content: మానిప్యులేషన్ ను నివారించడానికి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందిన కంటెంట్ పై డిస్క్లైమర్ ఉండాలని హిందుస్తాన్ టైమ్స్ డిజిటల్ సీఈఓ పునీత్ జైన్ సూచించారు. ఆయన గురువారం డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ కాంక్లేవ్ 2025 లో ప్రసంగించారు.

100 శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందిన కంటెంట్ కు కచ్చితంగా ఏదో ఒక రకమైన డిస్క్లైమర్ ఉండాలి. తద్వారా ప్రజలకు సరైన సమాచారం అందుతుంది. ఏది నిజం, ఏది నకిలీ అనేది స్పష్టంగా అర్థమవుతుంది'' అని అని పునీత్ జైన్ 'ఏఐ యుగంలో మీడియా పరివర్తనలు' అనే అంశంపై జరిగిన సదస్సులో అన్నారు. విశ్వసనీయమైన, ధృవీకరించబడిన వార్తా ఖాతాలను లేబుల్ చేయాలని, ఇది ప్రజలకు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.

విధానకర్తలు, కంటెంట్ సృష్టికర్తలు, డిజి...