భారతదేశం, ఏప్రిల్ 6 -- Ahmed Basha Arrest : వైసీపీ నేత, మాజీ మంత్రి అంజద్‌ బాషా సోదరుడు అహ్మద్‌ బాషాను కడప పోలీసులు అరెస్ట్‌ చేశారు. అహ్మద్ బాషాపై లుక్‌ అవుట్‌ నోటీసులు ఉండడంతో... ముంబయి ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప పోలీసులకు అప్పగించారు. అహ్మద్ బాషా కువైట్‌ వెళ్తున్నట్లు కడప పోలీసులు గుర్తించి, అడ్డుకున్నారు.

కడప వినాయక నగర్‌లోని ఓ స్థలం వివాదంలో దాడి చేసినట్లు అహ్మద్‌ బాషాపై కేసు నమోదైంది. దీంతో పాటు కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిని దూషించారని అహ్మద్ బాషాపై కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కడప పోలీసులు అహ్మద్‌ బాషాను ముంబయిలో అరెస్ట్‌ చేశారు. సోమవారం కడప కోర్టులో ఆయన్ను హాజరుపరిచే అవకాశముంది.

2022లో కడప వినాయక నగర్​లోని స్థల వివాదంలో జరిగిన ఘర్షణలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తిపై అంజ...