భారతదేశం, మార్చి 10 -- వ్యవసాయ రంగంలో నూతన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి బయోఫాక్టర్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం మధ్య కీలక ఒప్పందం కుదిరింది. నానో టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, శాస్త్రీయంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ఈ ఒప్పందంపై.. హైదరాబాద్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.దేవేష్ నిగమ్, బయోఫాక్టర్ సీఈఓ డా.లక్ష్మీ నారాయణ రెడ్డి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ వీసీ ప్రొఫెసర్ బీ.జే.రావు, పరిశోధన విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ సమ్రాట్ సాబత్, ఇతర అధ్యాపకులు హాజరయ్యారు.

కొత్త నానో కణాల అభివృద్ధి- వివిధ రంగాలకు అనువైన, వినూత్న నానో కణాల రూపకల్పనపై పరిశోధన.

నానో కణాల భద్రత, పర్యావరణ అనుకూలత- విష పరీక్షలు నిర్వహించి, భద్రతా ప్రమాణాలను నిర్ధారించడం.

ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు- నానో టెక్నాలజీ అనువర్తనాల్లో శాస్త్రవేత్తలు,...