Hyderabad, ఫిబ్రవరి 8 -- మనం చాలా సార్లు మహిళలు ఉన్న వయస్సు కంటే ఎక్కువ వయస్సు వారిలా కనిపించడం గమనిస్తుంటాం. అనేక రకాల వ్యాధులు వారి చర్మం తీరుని మార్చేసి ముడతలు కలిగేలా చేస్తుంది. ఫలితంగా చిన్న వయస్సులో ఉండగానే ఆంటీ అని పిలింపించుకుంటారు. అలా మహిళలకు వయసుకు ముందే వృద్ధాప్యం రాకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ఈ అలవాట్లను వెంటనే వదిలేయాలి.

చాలా మంది మహిళల్లో కామన్‌గా తాము రోజంతా నిలబడి పనిచేస్తాం. కాబట్టి, ఎటువంటి వ్యాయామం అవసరం లేదని అనుకుంటారు. కానీ, వ్యాయామం అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. గంటల కొద్దీ నిలబడి ఉండే వారు, కూర్చుని మీ కాళ్ళను బలపరుచుకునే వ్యాయామం చేయాలని తెలుసుకోండి. దీనివల్ల వృద్ధాప్యంలో వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. గుండె ఆరోగ్యానికి కూడా వ్యాయామం చాలా ముఖ్యం.

మహిళలు తరచుగా భవిష్యత్తు గురించి, ఇతరుల ఆలోచనల గురించి...