Hyderabad, మార్చి 13 -- Agent OTT Streaming: ఏజెంట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇస్తూ.. అనౌన్స్ చేసినదానికి ఒక రోజు ముందే స్ట్రీమింగ్ మొదలు కావడం విశేషం. వివిధ కారణాల వల్ల డిజిటల్ ప్రీమియర్ వాయిదా పడుతూ రాగా.. మొత్తానికి గురువారం (మార్చి 13) సాయంత్రం ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అఖిల్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. ఎప్పుడో రెండేళ్ల కిందటే థియేటర్లలోకి వచ్చినా.. ఇప్పుడు అప్పుడూ అంటూ డిజిటల్ ప్రీమియర్ వాయిదా పడుతూ వచ్చింది.

ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మ...