Hyderabad, ఏప్రిల్ 9 -- నలభై ఏళ్ల వయసును ఒకప్పుడు యువతగానే చెప్పేవారు. కానీ ఇప్పుడు 40 ఏళ్లు వస్తే అనేక శారీరక, మానసిక సమస్యలు మొదలైపోతున్నాయి. డయాబెటిస్ కూడా నలభై ఏళ్లు దాటాక వచ్చే అవకాశం ఎక్కువైపోతుంది. నలభై ఏళ్లు తర్వాత మీరు ఏ రోగాల బారిన పడకుండా ఫిట్‌గా ఉండాలంటే మీరు ప్రతిరోజు కొన్ని పనులను కచ్చితంగా చేయాలి. ముప్పయేళ్లలో ఉన్నవారు ఇప్పటినుంచే ఈ అలవాట్లు పాటిస్తే నలభై ఏళ్లు దాటాక కూడా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.

40 ఏళ్ల తర్వాత శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. కీళ్ల నొప్పులు, గుండె జబ్బుల ప్రమాదం పెరిగిపోతుంది. హార్మోన్ల అసమతుల్యత వంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. 40 ఏళ్ల తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడే మీరు ప్రత్యేక శ్రద్ధను పెట్టాల్సి వస్తుంది.

ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వాకింగ్, రన్నింగ్, స్కిప్పింగ్ వంటివి చేయడం వల్...