భారతదేశం, సెప్టెంబర్ 1 -- అఫ్గానిస్థాన్​లో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 600 దాటింది. నంగర్‌హర్ ప్రావిన్స్​లో సోమవారం సంభవించిన ఈ 6.3 తీవ్రత గల భూకంపం వల్ల మరో 1000 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

భూకంపం కారణంగా కూలిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొదట 250 మంది మరణించినట్లు సమాచారం రాగా.. ఆ తర్వాత ప్రభుత్వ మీడియా సంస్థ రేడియో టెలివిజన్ అఫ్గానిస్థాన్​(ఆర్టీఏ) ఈ సంఖ్యను 500కి పెంచింది. అనంతరం.. తాలిబాన్ ఆధ్వర్యంలోని అఫ్గాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారికంగా మరణాల సంఖ్య 622గా నిర్ధారించింది.

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నందున మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ మాట్లాడుతూ.. "మరణాలు, గాయాల సంఖ్య ఎక్కు...