భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో నేటి నుంచి ప్రారంభమైంది. దీనిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ప్రతిష్టాత్మకమైన ఈ ఎయిర్ షోకు ఇది 15వ ఎడిషన్. ఇందులో ఎన్నో అరుదైన దృశ్యాలు కనిపించాయి. చిరకాల ప్రత్యర్థి దేశమైన రష్యా, అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు తొలిసారి ముఖాముఖిగా కనిపించాయి. వైమానిక స్థావరం నుంచి రష్యా ఫైటర్ జెట్ ఎస్ యూ-57 టేకాఫ్ అవుతున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. అమెరికా, రష్యాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు ఒకే ఫ్రేమ్‌లో నిలబడి కూడా ఉన్నాయి.

రష్యాకు చెందిన ఎస్‌యూ-57 ఫెలోన్ , అమెరికాకు చెందిన ఎఫ్ -35 లైటనింగ్ II యుద్ధ విమానాలు ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఐదో తర యుద్ధ విమానాలుగా గుర్తింపు పొందాయి. ఈ రెండు యుద్ధ విమానాలు ఈ ప్రదర్శనలో భాగంగ...