భారతదేశం, ఫిబ్రవరి 8 -- అప్స‌ర‌రాణి హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ త‌ల‌కోన స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా శ‌నివారం సెలైంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంట‌ల్ విధానంలో విడుద‌లైంది. 99 రూపాయ‌లు రెంట‌ల్ ఛార్జెస్‌గా ఫిక్స్ చేశారు. థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌ది నెల‌ల త‌ర్వాత త‌ల‌కోన ఓటీటీలోకి వ‌చ్చింది.

యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన త‌ల‌కోన‌ మూవీలో అప్స‌ర రాణితో పాటు అజ‌య్ ఘోష్‌, అశోక్ కుమార్ కీలక పాత్ర‌లు పోషించారు. న‌గేష్ నార‌దాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది మార్చిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. అప్ప‌ర‌రాణి గ్లామ‌ర్‌, యాక్టింగ్ త‌ల‌కోన సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయి. ఐఎమ్‌డీబీలో 8.7 రేటింగ్‌ను ఈ మూవీ సొంతం చేసుకున్న‌ది.

త‌ల‌కోన మూవీలో సారా అ...