భారతదేశం, ఫిబ్రవరి 10 -- భారతదేశం అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌ను కలిగి ఉంది. భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో మైలేజ్ ఇచ్చే సరసమైన మోటార్‌సైకిళ్లూ ఉన్నాయి. దానితోపాటుగా లక్షల్లో ధర ఉండే క్లాస్ బైక్‌లు దొరుకుతాయి. మీరు రాబోయే రోజుల్లో అడ్వెంచర్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తే.. మీ కోసం కొన్ని బైకుల వివరాలు తీసుకొచ్చాం. 3 లక్షల కంటే తక్కువ ధరకే లభించే 5 బైక్‌ల లిస్టు చూద్దాం..

సుజుకి వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్ రూ. 2.16 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. సుజుకి వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్.. 249 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో అమర్చబడి ఉంది. ఈ పవర్‌ట్రెయిన్ 25 బీహెచ్‌పీ పవర్, 22 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ దీనికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బీ ఛార్జింగ్‌తో బ్లూటూత్ కనెక్టివిటీని అందిస్తుంది.

హీరో ఎక్స్‌...