Hyderabad, మార్చి 31 -- Aditya 369 Rerelease Trailer: ఆదిత్య 369 మూవీ గుర్తుందా? ఇండియాలో తొలి టైమ్ ట్రావెల్ మూవీ ఇది. 1991లో రిలీజై సంచలన విజయం సాధించిన సైన్స్ ఫిక్షన్ మూవీ. ఆ కాలంలో ఇలాంటి సినిమా తెలుగులో రావడమే ఓ సంచలనం. ఇప్పుడీ సినిమా ఏప్రిల్ 4న థియేటర్లలో రీరిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది.

ఒకప్పటి సినిమాలను ఇప్పటి 4కే వెర్షన్ లో థియేటర్లలో రీరిలీజ్ చేస్తూ ప్రేక్షకులను మరోసారి ఆ కాలానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఎప్పుడో 34 ఏళ్ల కిందట అంటే 1991లో థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ఆదిత్య 369 మూవీ కూడా రీరిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 4న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సింగీతం శ్రీనివాస రావు డైరెక్షన్ లో బాలకృష్ణ నటించి సినిమా ఇది.

టైమ్ మెషీన్, కాలంలో వెనక్కి, ముందుకు ...