భారతదేశం, మార్చి 18 -- నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఆల్ టైమ్ క‌ల్ట్ క్లాసిక్ మూవీ ఆదిత్య 369 మ‌రోసారి థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ప్ర‌క‌టించారు. సైన్స్ ఫిక్ష‌న్ ఫాంట‌సీ జాన‌ర్‌లో రూపొందిన ఈ మూవీకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.

మోహిని హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీకి ఇళ‌య‌రాజా మ్యూజిక్ అందించారు. దిగ్గ‌జ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆదిత్య 369 మూవీకి సమర్పకుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. 1991లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఆదిత్య 369 ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించ‌డ‌మే కాకుండా రెండు నంది అవార్డుల‌ను సొంతం చేసుకున్న‌ది.

'ఆదిత్య 369' రీ రిలీజ్ సందర్భంగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృ...