తెలంగాణ,ఆదిలాబాద్, ఫిబ్రవరి 27 -- తన జాతి వారికి ఏదో చేయాలనే ఉద్దేశ్యంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సరికొత్తగా ఆలోచించాడు. మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే తనకున్న తెలివితేటలు ఉపయోగించి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే. ఇటీవలే మన్ కీ బాత్" కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. తెలంగాణలోని ఆదిలాబాద్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తోడసం కైలాష్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (Al)ని వాడుతున్న తీరును ప్రస్తావించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడైన కైలాశ్. ఏఐ టూల్స్ సాయంతో ఆదివాసీల భాషల్లో ఒకటైన కొలామీ భాషలో పాటలు రూపొందించడం అద్భుతం అని ప్రధాని కొనియాడారు. కొలామీతో పాటు మరిన్ని ఆదివాసీ భాషల్లో పాటలు రూపొందించడానికి కైలాష్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆదివాసీ భాషలను కాపాడే చర్యల్లో ఇది కొ...