ఆదిలాబాద్,తెలంగాణ, మార్చి 12 -- తెలంగాణ రాష్ట్రములో అతి ప్రాచీన దేవాలయాలలో సిరిచల్మా మల్లికార్జున శివాలయము ఒకటి. ఇది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చాడ మండల కేంద్రానికి 15 కి. మీ. దూరములో ఉంటుంది. గ్రామానికి దక్షిణం వైపున ఉన్న చెరువులో తూర్పుముఖముగా నిర్మించబడినది. ఉత్తరాయణంలోని పాల్గుణ మాసంలో సూర్యకిరణాలు 17 దర్వాజలు, నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగంపై పడడం ఈ ఆలయం ప్రత్యేకత . ఈ దేవాలయంలోని శివలింగంపై సొట్టపడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ శివలింగం ముందు చిన్న రెండు నంది విగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఒకటి కండ్లు తెరచి. మరోకటి కండ్లు మూసి ఉంటాయి.

ప్రదాన దేవాలయ ద్వారం 8వ శతాబ్దంలో పరిపాలించిన రాష్ట్ర కుటుల కాలంలో నిర్మించబడింది. ద్వారంపైన గజలక్ష్మి శిల్పంతో పాటు ఇరువైపులా కళశాలు చెక్కబడి ఉన్నాయి. మండపంలో గౌతమ బుద్ధుడు, మాతంగుడు, భక్త హన్మన్, గణపతి, విగ్రహాలున...