భారతదేశం, మార్చి 11 -- Adilabad Cyber Crime : సైబర్ నేరాలను చేయాలని పథకం వేసిన ఘరానా ముఠాను ఆదిలాబాద్ రెండో పట్టణ, సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.

బీహార్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు నిందితులు ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడడానికి ప్లాన్ వేసుకున్నారు. తబరాక్ అనే గ్యాంగ్ లీడర్ ఆధ్వర్యంలో మరో ఐదుగురు నిందితులు బీహార్ నుంచి తెలంగాణకు వచ్చారు. బైక్ లపై తిరుగుతూపాత మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేస్తున్నారు. గ్రామాలలో, పట్టణాలలో బైక్ లపై తిరుగుతూ పాత మొబైల్ ఫోన్లను, సిమ్ కార్డులు, బ్యాటరీలను సేకరించి వాటిలో లభ్యమైన సిమ్ కార్డుల ద్వారా, ఫోన్ల ద్వారా వివిధ రాష్ట్రాలలోని ప్రజలకు బ్యాంక్ అధికారులు అంటూ ఫోన్లు చేసి సైబర్ నేరాలు చేసేందుకు ...