తెలంగాణ,ఆదిలాబాద్, ఏప్రిల్ 3 -- ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ఏండ్లుగా ఎయిర్ ఫోర్ట్ కళ నిర్మిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారి కలలను నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ లో ఎయిర్ ఫోర్ట్ ను అభివృద్ధి చేసేందుకు వాయుసేన సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

పౌరవిమానయాన అవసరాలకు తగినట్లుగా రన్ వే పునర్నిర్మాణం, టర్మినల్, మౌలిక వసతుల ఏర్పాట్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి సంయుక్త ప్రయోజనాలకు వాడేందుకు సమ్మతి తెలిపింది.

ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర కార్యకలాపాల కోసం అభివృద్ధి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు రక్షణ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ అభ్యర్ధను పరిశీలించిన తర్వాత భారత వైమానిక దళం (IAF) పౌర విమాన కార్యకలాపాలను అనుమతించడానికి అ...