భారతదేశం, మార్చి 3 -- ఇటీవల కేంద్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ విమానాశ్రయం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. విమానం ఎగరవచ్చని ఏళ్ల తరబడి జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. కానీ నిరాశే మిగిలింది. అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. జిల్లాకు మొండిచేయి చూపింది. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుపై ఊసెత్తలేదు.

జిల్లాకు ఎయిర్‌పోర్ట్ తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని.. ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఎయిర్‌పోర్ట్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం.. ఆ తర్వాత మరిచిపోవడం కామన్ అయ్యిందని ప్రజలు చెబుతున్నారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నా.. ఆదిలాబాద్‌ అభివృద్ధి చెందడం లేదు. ఎయిర్‌పోర్ట...