భారతదేశం, మార్చి 11 -- నితిన్, శ్రీలీల హీరోహీయిన్లుగా నటించిన రాబిన్‍హుడ్ చిత్రం మార్చి 28వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్లను ఈ మూవీ టీమ్ మొదలుపెట్టేసింది. ఈ కామెడీ యాక్షన్ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. రాబిన్‍హుడ్ చిత్రం నుంచి 'అదిదా సర్‌ప్రైజ్' అంటూ ఓ స్పెషల్ సాంగ్ తాజాగా వచ్చింది. కేతిక శర్మ ఈ పాటలో చిందేశారు. దీనిపై ఇప్పుడు రచ్చసాగుతోంది.

రాబిన్‍హుడ్ నుంచి 'అదిదా సర్‌ప్రైజ్' పాట లిరికల్ వీడియో సోమవారం (మార్చి 10) రిలీజైంది. ఈ లిరికల్ వీడియోలో కేతిక శర్మ చేసిన కొన్ని డ్యాన్స్ స్టెప్స్ కూడా రివీల్ చేసింది మూవీ టీమ్. ఈ స్పెషల్ పాట హుషారైన బీట్‍తో ఉంది. అయితే, ఈ పాటలో కేతిక శర్మ చేసిన కొన్ని డ్యాన్స్ స్టెప్‍లపై నెటిజన్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసభ్యకరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్న...