ఆంధ్రప్రదేశ్,అమరావతి, మార్చి 27 -- ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని న‌గ‌రం అభివృద్ధి, అమ‌ల‌కు మౌలిక స‌దుపాయాల‌కు సంబంధించిన ప‌నులు చేప‌ట్టే అమ‌రావ‌తి డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఏడీసీఎల్‌) పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుద‌ల చేశారు. మొత్తం ఏడు పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

వీటిలో ఆరు పోస్టుల‌కు మార్చి 28వ తేదీ సాయంత్ర 5.30 గంట‌లలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌ల్సి ఉంటుంది. మరో పోస్టుకు ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 5.30 గంట‌లలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ ఏడు పోస్టుల‌ను కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలోనే భ‌ర్తీ చేస్తున్నారు. అర్హ‌త‌, ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఏడీసీఎల్ కోరుతోంది.

1. సీనియ‌ర్ వోహెచ్ఎస్ స్పెష‌లిస్ట్ (01)- ఆక్యూపేష‌న‌ల్‌ హెల్త్ అండ్‌ సేఫ్టీ, ఇన్విరాన్‌మెంటల్ హెల్త్‌, ఇండ‌స్ట్రీ సేఫ్టీతో పాటు వాటికి స...