భారతదేశం, ఏప్రిల్ 7 -- ఇవాళ, రేపు గిరిజన గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పర్యటించనున్నారు. అల్లూరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్న పవన్‌.. అడవితల్లి బాట పేరుతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. గిరిజనులతో సమావేశం కానున్నారు. సుంకరమెట్టలో ఉడెన్‌ బ్రిడ్జి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లక్ష్యాలు, ముఖ్యమైన 8 అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం.. పవన్ కల్యాణ్ విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా డుంబ్రిగూడ మండలం, పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి బయలుదేరారు.

2.గిరిజన గ్రామాల అభివృద్ధి నిమిత్తం "అడవి తల్లి బాట" కార్యక్రమానికి పెదపాడు గ్రామంలో పవన్ కళ్యాణ్ శ్రీకారం చుడతారు.

3.పవన్ కళ్యాణ్ "అడవి తల్లి బాట" కార్యక్రమం గిరిజన ప్రాంతాల అభివ...