భారతదేశం, సెప్టెంబర్ 11 -- టాటా నెక్సాన్ ఈవీకి భారీ అప్‌డేట్ లభించింది! ఇప్పుడు ఈ కారులో అడాస్​ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) అనే అధునాతన భద్రతా సాంకేతికతను జోడించారు. దీనితో పాటు సంస్థ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి ప్రీమియం లుక్‌ను అందించే బ్లాక్-అవుట్ డిజైన్‌తో కొత్త డార్క్​ ఎడిషన్​ని కూడా విడుదల చేసింది.

కొత్తగా అప్‌డేట్ అయిన నెక్సాన్ ఈవీ 45 శ్రేణిలో ఉన్నత స్థానంలో ఉంది. ఈ ఎలక్ట్రిక్​ కారు ధరలు ఎంపవర్‌డ్ +ఏ 45 వేరియంట్‌కు రూ. 17.29 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇక డార్క్​, రెడ్ డార్క్​ ఎడిషన్‌ల ధర రూ. 17.49 లక్షలు.

ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే.

టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ.. "అడాస్​ భద్రతా సాంకేతికతను ప్రవేశపెట్టడం, డార్క్ ఎడిషన్‌న...