భారతదేశం, ఫిబ్రవరి 10 -- చాలా మంది సినీ హీరోయిన్లకు యాక్టింగ్ మాత్రమే కాకుండా వేరే టాలెంట్లు కూడా ఉన్నాయి. అయితే ఇవి పెద్దగా బయటికి రావు. సినిమాల్లోకి వచ్చాక యాక్టింగ్ పర్పార్మెన్స్, డ్యాన్స్‌లపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు. కొందరు అప్పుడప్పుడు మాత్రం వారి అదనపు టాలెంట్ గురించి చెబుతుంటారు. దీంతో చాలా మంది ప్రేక్షకులను నటీమణుల ఇతర నైపుణ్యాల గురించి ఎక్కువగా తెలిసి ఉండదు. అలా ఐదుగురు హీరోయిన్లు హిడెన్ టాలెంట్స్ ఏవో ఇక్కడ చూడండి.

రకుల్‍ప్రీత్ సింగ్ అందం, అభినయంతో మెప్పిస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్‍కు చేరారు. టాలీవుడ్‍లో చాలా చిత్రాలు చేసిన రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్‍పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే, సినిమాల్లోకి రాకముందు రకుల్‍ప్రీత్.. గోల్ఫ్ క్రీడాకారిణి. జాతీయస్థాయిలో గోల్ఫ్ పోటీల్లోనూ ఆమె పాల్గొన్నారు. చాలా కాలం గోల్ఫ్ క్రీజలో శిక్షణ తీసుకున...