Hyderabad, మార్చి 16 -- Actress Pramodini On Annapurnamma: తెలుగు కమెడియన్ సప్తగిరి హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ పెళ్లి కాని ప్రసాద్. మల్లీశ్వరి మూవీలో వెంకటేష్ పేరుతో టైటిల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించారు. ఇందులో సప్తగిరికి జోడీగా హీరోయిన్ ప్రియాంక శర్మ నటించింది.

అలాగే, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ప్రమోదిని పెళ్లి కాని ప్రసాద్ మూవీలో కీలక పాత్రలు పోషించారు. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి ఈ సినిమాను నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ ఈ సినిమాను సమర్పిస్తోంది.

దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పెళ్లికాని ప్రసాద్ టీజర్...