Hyderabad, మార్చి 3 -- సాధారణంగా బరువు తగ్గడం ఒక ఎత్తైతే, గర్భం తర్వాత బరువు తగ్గడం మహిళలకు మరింత సవాలుగా అనిపిస్తుంది. ఇందులో గృహిణులు చాలా వరకూ సక్సెస్ కాలేరు. పెరిగిన బరువుతోనే గడిపేస్తారు. చాలా తక్కువ మంది మాత్రం ప్రయత్నం చేసినా అంత ప్రభావవంతంగా సక్సెస్ కాలేరు. మరి, ఇటీవల కాలంలో ప్రెగ్నెంట్ అయి డెలివరీ అయిన బాలీవుడ్ హీరోయిన్లు మళ్లీ మునుపటి లుక్‌లోకి వచ్చేశారు. మిగతా వాళ్లకు సాధ్యం కానిది వాళ్లకు మాత్రమే ఎలా కుదిరింది? వాళ్లు పాటించిన నియమాలు, సీక్రెట్స్ ఏంటో తెలుసుకోవాలని మీకూ ఉందా..? రండి, ఒక్కొక్కరు ఎలాంటి టెక్నిక్స్ తో ఇది సాధ్యమయ్యేలా చేసుకున్నారో తెలుసుకుందాం.

ఆలియా భట్‌కు ప్రసవం తర్వాత వ్యాయామం చేసేందుకు 12 వారాల వరకూ వెయిట్ చేయమని వైద్యులు సలహా ఇచ్చారు. అదే ఫాలో అయిన ఆమె, ఆ మధ్య కాలంలో 15 నిమిషాల పాటు నడక, శ్వాస వ్యాయామాలు చే...