భారతదేశం, మార్చి 7 -- సినిమాల్లో నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తళపతి విజయ్.. పొలిటికల్ జర్నీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ స్థాపించి, తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారారు. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగాలని చూస్తున్న విజయ్.. పొలిటికల్ ప్రోగ్రామ్స్ ను జోరుగా నిర్వహిస్తున్నాడు. శుక్రవారం (మార్చి 7) చెన్నైలో తన పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన ఇఫ్తార్ విందులో తళపతి లుక్ వైరల్ గా మారింది. వైట్ అండ్ వైట్ లో విజయ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి తళపతి విజయ్ నమాజ్ చేశాడు. ముస్లింలు ధరించే ట్రెడిషనల్ స్కల్ క్యాప్ ను విజయ్ తలపై ధరించాడు. పూర్తిగా వైట్ అండ్ వైట్ లో మెరిసిపోయాడు. ముస్లిం సోదరుల మధ్యలో కూర్చుని నమాజ్ చేస్తున్న తళపతి ఫొటో వైరల్ గా మారింది. తీక్షణంగా చూస్తున్...