భారతదేశం, మార్చి 7 -- Action Thriller OTT: సోనూ సూద్ హీరోగా న‌టించిన ఫ‌తే మూవీ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న ఈ బాలీవుడ్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. దాదాపు రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం కేవ‌లం హిందీ వెర్ష‌న్ మాత్ర‌మే జియో హాట్‌స్టార్‌లో విడుద‌లైంది. త్వ‌ర‌లోనే ద‌క్షిణాది భాష‌ల్లో ఈ మూవీ అందుబాటులోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఫ‌తే మూవీలో హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు సోనూ సూద్‌. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీతోనే డైరెక్ట‌ర్‌గా అరంగేట్రం చేశాడు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో న‌సీరుద్దీన్ షా, విజ‌య్ రాజ్‌, నాగినీడు కీల‌క పాత్ర‌లు పోషించారు.

థియేట‌ర్ల‌లో ఫ‌తే మూవీ మిక్స్...