భారతదేశం, జనవరి 30 -- Action Thriller OTT: తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ పోతుగ‌డ్డ నేరుగా ఓటీటీలో రిలీజైంది. గురువారం (నేటి) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ మూవీలో పృథ్వీ దండ‌మూడి, విస్మ‌య హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఆడుకాలం న‌రేన్‌, శ‌త్రు కీల‌క పాత్ర‌లు పోషించారు.

ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యానికి పొలిటిక‌ల్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు ర‌క్ష వీర‌మ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో పోతుగ‌డ్డ‌ మూవీని తెర‌కెక్కిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్‌లో పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోతుగ‌డ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే స‌ముద్ర‌ను (ఆడుకాలం న‌రేన్‌) ఎలాగైనా ఓడించాల‌ని భాస్క‌ర్ (శ‌త్రు) నిర్ణ‌యించుకుంటాడు. ఎన్నిక‌ల కోసం కోట్ల రూపాయ‌ల డ‌బ్బును సిద్ధం చేసుకుంటాడు. కృష్ణ (ఫృథ్వీ...