భారతదేశం, ఫిబ్రవరి 12 -- Action Thriller Movie: టాలీవుడ్ హీరోయిన్లు శ్రీదివ్య, అనంతిక స‌నీల్‌కుమార్ న‌టించిన త‌మిళ మూవీ రైడ్ తెలుగులో అదే పేరుతో డ‌బ్ అయ్యింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో విక్ర‌మ్ ప్ర‌భు హీరోగా న‌టించాడు. రైడ్ మూవీ తెలుగు వెర్ష‌న్‌ యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా 4కే వెర్ష‌న్‌ యూట్యూబ్‌లో రిలీజైంది. రైడ్ మూవీ తెలుగు వెర్ష‌న్‌ను ఆహా ఓటీటీలోనూ చూడొచ్చు.

క‌న్న‌డంలో శివ‌రాజ్‌కుమార్ హీరోగా న‌టించిన త‌గారు మూవీకి రీమేక్‌గా రైడ్ తెర‌కెక్కింది. క‌న్న‌డంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ త‌మిళంలో యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగున్నాయ‌నే కామెంట్స్ వినిపించాయి. 2023లో రైడ్‌ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది.

ప్ర‌భాక‌ర‌న్ (విక...