భారతదేశం, మార్చి 7 -- అక్షయ్ కుమార్ హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ స్కై ఫోర్స్ ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 249 రూపాయ‌ల రెంట్‌తో రిలీజ్ చేశారు. మ‌రో రెండు వారాల త‌ర్వాత ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్న‌ట్లు తెలిసింది.

స్కై ఫోర్స్ మూవీలో అక్ష‌య్ కుమార్‌తో పాటు వీర్ ప‌హారియా, సారా అలీఖాన్‌, నిమ్ర‌త్ కౌర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ యాక్ష‌న్ మూవీకి సందీప్ కేవ్లానీ, అభిషేక్ అనిల్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 24న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది. దాదాపు 160 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో 149 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకు...