భారతదేశం, మార్చి 27 -- ఆస్కార్ నామినేటెడ్ యాక్ష‌న్ మూవీ ట్విలైట్ ఆఫ్ ది వారియ‌ర్స్ వాల్డ్ ఇన్‌ ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, చైనీస్‌, త‌మిళ భాష‌ల్లో ఈ మూవీ రిలీజైంది.

హాంకాంగ్ నుంచి బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేట‌గిరీలో ఆస్కార్‌కు ఈ మూవీ నామినేట్ అయ్యింది. కానీ తుది నామినేష‌న్స్‌లో మాత్రం చోటు ద‌క్కించుకోలేక‌పోయింది. ట్విలైట్ ఆఫ్ ది వారియ‌ర్స్ వాల్డ్ ఇన్ మూవీ హాంకాంగ్ సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సెకండ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ట్విలైట్ ఆఫ్ ది వారియ‌ర్స్ వాల్డ్ ఇన్ మూవీకి సోయ్ చెనాంగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లూయిస్ కూ, స‌మ్మో హంగ్‌, రిచీ జెమ్‌, రేమండ్ లాంగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మార్ష‌ల్ ఆర...