భారతదేశం, జనవరి 28 -- Action OTT: నిహారిక కొణిదెల హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ మ‌ద్రాస్‌కార‌ణ్ థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి వ‌స్తోంది. మ‌ద్రాస్‌కార‌ణ్ మూవీలో షేన్ నిగ‌మ్, క‌లైయరాస‌న్‌, ఐశ్వ‌ర్య ద‌త్తా కీల‌క పాత్ర‌లు పోషించారు. రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి వాలి మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మ‌ద్రాస్‌కార‌ణ్ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. రిలీజ్ డేట్‌ను ఆహా ఓటీటీ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. ఓ యాక్ష‌న్ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది. థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుండ‌టం గ‌మ‌నార్హం. పొంగ‌ల్ కానుక‌గా జ‌న‌వ‌రి 10న మ‌ద్రాస్‌కార‌ణ్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేసింది.

రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌, ...