తెలంగాణ,వరంగల్, ఫిబ్రవరి 8 -- హనుమకొండలోని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ (డీటీసీ) డా.పుప్పాల శ్రీనివాస్ కు చెందిన ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో శుక్రవారం ఉదయం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల పరిధిలోని పలివేల్పుల మార్గంలోని దుర్గా కాలనీలో ఉంటున్న శ్రీనివాస్ ఇంటికి ఉదయం 6 గంటలకు చేరుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు డీటీసీ శ్రీనివాస్ కు సంబంధించిన ఆదాయ పత్రాలు, దస్తావేజులు, స్థిర, చరాస్తులకు సంబంధించి విలువైన డాక్యుమెంట్లు పరిశీలించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు డీటీసీ పుప్పాల శ్రీనివాస్ స్వస్థలమైన జగిత్యాలలో కూడా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో ఆయనకు ఉన్న విల్లా...