భారతదేశం, జనవరి 29 -- ACB Raids : అవినీతి అధికారులకు ఏసీబీ చుక్కలు చూపిస్తుంది. వరుస దాడులతో హడలెత్తిస్తుంది. అయినా కొంతమంది అధికారులు కాసుల కోసం కక్కుర్తిపడుతున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ వెటర్నరీ డాక్టర్ ఏసీబీ అధికారులు చిక్కారు. రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ శ్యాంపూర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (పశువుల డాక్టర్) రమేష్ రాథోడ్ ఏసీబీ వలకు చిక్కారు. బుధవారం రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని రికార్డులను పరిశీలించారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఉదయ నాయక్ తండాలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ ఉద్యోగిగా పనిచేసిన జుగ్నాక మాధవ్ ఇటీవల బదిలీ అయ్యారు. తన ఉద్యోగ విధులకు సంబంధించి రెండు నెలల డ్యూటీ సర్టిఫికెట్ కు జారీ కోసం వెటర్నరీ అసిస...