భారతదేశం, డిసెంబర్ 28 -- ACB Raids : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. నెలలో ఒకలిద్దరూ ఏసీబీకి చిక్కుతున్నారు. గత నెలలో అంతర్గాం తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా తాజాగా శంకరపట్నం డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం పట్టుపడ్డారు. రైతు నుంచి ఆరు వేలు లంచం తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్ మల్లేశంను ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు. రూ.6000 సీజ్ చేసి, కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి పలు ఫైళ్ళను స్వాధీనం చేసుకున్నారు.

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు కలకుంట్ల నవీన్ రావు తనకు ఉన్న రెండు గుంటలు వ్యవసాయ భూమి నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పది రోజుల అయినా డిప్యూటీ తహసీల్దార్ పట్టించుకోలేదు. పది వేల రూపాయలు ఇస్తేనే పని అవుత...