ఆంధ్రప్రదేశ్,గుంటూరు, మార్చి 23 -- వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినీపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారన్న అభియోగాలతో ఆమెపై చర్యలకు దిగింది. తాజాగా ఆమెపై కేసు నమోదు చేసిన ఏసీబీ. ఏ1గా చేర్చింది. దీంతో ఆమెకు నోటీసులు జారీ చేయటంతో పాటు విచారణకు పిలిచే అవకాశం ఉంది.

విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్‌వీఈవో((రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి)గా ఉన్న ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వీరికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ ప్రకారం ఏసీబీ. ఇటీవలనే సీఎస్‌ అనుమతి తీసుకుంది. విడదల రజినిపై...