భారతదేశం, ఏప్రిల్ 8 -- ACB Arrest : పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఐకేపీ కమ్యూనిటీ కో ఆర్డినేటర్ సురేష్ వీవోఏకు సంవత్సరం జీతం రూ.60 వేలు ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తొలి విడతగా పది వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన స్వప్న గత నాలుగు సంవత్సరాల నుండి గ్రామైఖ్య సంఘం సహాయకురాలుగా పని చేస్తుంది. తనకు రావాల్సిన సంవత్సర జీతం రూ.60 వేల చెక్కును ఇవ్వడానికి రూ.20 వేలు డిమాండ్ చేశాడు కోఆర్డినేటర్ సురేష్. అయితే తనకు వచ్చే జీతం కేవలం నెలకు ఐదు వేలని, తాను అన్ని డబ్బులు ఇవ్వలేనని బతిమిలాడిన సదరు కోఆర్డినేటర్ వినకపోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. మొదటగా పది వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్...