Hyderabad, ఏప్రిల్ 8 -- వేసవి వేడి, ఉక్కపోత కారణంగా పిల్లలు చాలా చికాకుగా ఫీలవుతుంటారు. వేడి గాలులు, చెమట వారిని అయోమయానికి గురి చేస్తాయి. చాలా మంది పిల్లలు సరిగ్గా నిద్రపోవడం మానేస్తారు. ఇలాంటి సమయంలో వారిని రక్షించేది ఏసీలు, కూలర్లే. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు ఇప్పటికే ఇళ్లలో ఏసీలు, కూలర్లు వాడటం ప్రారంభించారు. ముఖ్యంగా ఏసీలు తీవ్రమైన వేడి నుండి చక్కటి ఉపశమనం కలిగిస్తాయి.

ఏసీ గదిలో పడుకొబ్టగానే పిల్లలు హాయిగా నిద్రపోతారు. ఉక్కపోత, చెమట కారణంగా చికాకు లేకుండా చలాకీగా ఆడుకుంటారు. కేవలం పిల్లల కోసమే ఇంట్లో ఏసీ పెట్టించుకునే తల్లిదండ్రులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇందులో తప్పు లేదనుకోండి. అయితే.. ఏసీ గదిలో పిల్లలను పడుకోబెట్టేటప్పుడు లేదా రోజంతా వారిని ఏసీ గదిలో ఉంచేటప్పడు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పక తీసుకోవాలన...