Hyderabad, మార్చి 25 -- కొన్నిచోట్ల ఏసీ పేలి ప్రమాదాలు జరిగిన ఘటనలు మీరు వినే ఉంటారు. ఎక్కువగా ఇలాంటివి వేసవికాలంలోనే జరుగుతాయి. వేడి తట్టుకోలేక ఎక్కువ మంది ఏసీని ఈ కాలంలోనే వినియోగిస్తూ ఉంటారు. ఏసీ పేలడం చాలా ప్రమాదకరం... ఫ్లాట్ మొత్తం మంటలు అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏసీలు వాడేవారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏసీలు పేలిపోవడానికి ఉష్ణోగ్రతలో పెరుగుదల ముఖ్యమైనది. గదిని ఏసీ చల్లగా మార్చేందుకు బయట ఉండే కండెన్సర్ చాలా కష్టపడుతుంది. దాని పైనే ఒత్తిడి పడుతుంది. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు అధికంగా మారుతూ ఉంటాయో అప్పుడు కండెన్సర్ పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దానివల్లే ఒక్కొక్కసారి కండెన్సర్ పేలిపోయే అవకాశం ఉంది. సాధారణంగా మన దేశంలో ఏసీల కండెన్సర్ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంతకుమించి పెరిగిన ఉష్ణోగ్రతలను అవి తట్టుకోలేవు....