భారతదేశం, ఫిబ్రవరి 9 -- Abraham Ozler OTT: మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ అబ్ర‌హం ఓజ్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మెడిక‌ల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో జ‌య‌రాం హీరోగా న‌టించాడు. మ‌మ్ముట్టి సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో చేశాడు. . డిసెంబ‌ర్ 25న అబ్ర‌హం ఓజ్ల‌ర్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. దాదాపు ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా మూవీ 37 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ఈ సినిమాలో అబ్ర‌హం ఓజ్ల‌ర్ అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా జ‌య‌రాం యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అత‌డి కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీగా అబ్ర‌హం ఓజ్ల‌ర్ నిలిచింది. ఇందులో అలెగ్జాండ‌ర్ జోసెఫ్ అనే సీరియ‌...