భారతదేశం, ఫిబ్రవరి 13 -- Abhay Naveen Interview: ఏ ల‌క్ష్యంతోనైతే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టానో అది నెర‌వేరింద‌ని అన్నాడు న‌టుడు అభ‌య్ న‌వీన్‌. న‌టుడిగా నాపై ఉన్న అపోహ‌లు తొల‌గిపోవ‌డానికి బిగ్‌బాస్ హెల్ప‌యింద‌ని చెప్పాడు. పెళ్లిచూపులు మూవీతో న‌టుడిగా అభ‌య్ న‌వీన్ ప్ర‌యాణం మొద‌లైంది. హీరోగా, క‌మెడియ‌న్‌గా తెలుగులో ప‌లు సినిమాలు చేశాడు. రామ‌న్న యూత్ మూవీతో డైరెక్ట‌ర్‌గా మారాడు. బిగ్‌బాస్ త‌ర్వాత త‌న సినీ జ‌ర్నీ గురించి అభియ్ న‌వీన్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగుతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ఆయ‌న ఏం అన్నారంటే...

బిగ్‌బాస్ త‌ర్వాత కెరీర్ హ్యాపీగా సాగుతోంది. ప్ర‌స్తుతం యాక్ట‌ర్‌గా మూడు సినిమాలు చేస్తోన్నా. డైరెక్ట‌ర్‌గా నేను చేస్తోన్న ల‌వ్‌ మూవీ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఇంత‌కుముందు డైరెక్ట‌ర్‌గా రామ‌న్న యూత్ సినిమా చేశా. ఆ టైమ్‌లో నేను యాక్టిం...