భారతదేశం, జనవరి 28 -- AB Venkateswara Rao : విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీపై సస్పెన్షన్ వేటుపడింది. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

2020 ఫిబ్రవరి 2 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకూ మొదటి దఫాలో ఏబీవీని వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రెండో విడతలో 2022 జూన్ 28 తేదీ నుంచి 2024 మే 30 తేదీ వరకు మరోమారు సస్పెన్షన్ వేటు పడింది.

ఈ రెండు విడతల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా పేర్కొంటూ కూటమి ప్రభుత్వం క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనాన్ని, అలవెన్సులను చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.

సస్పెన్షన్ వ...