భారతదేశం, ఏప్రిల్ 16 -- Aavesham Review: ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఆవేశం ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. రొమాంచం ఫేమ్ జీతూ మాధ‌వ‌న్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రిలీజైన ఐదు రోజుల్లోనే యాభై కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మ‌ల‌యాళం గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?

శాంత‌న్ (రోష‌న్ శాన్‌వాజ్‌), బీబీ (మిథున్ జై శంక‌ర్‌), అజు(హిప్‌స్ట‌ర్‌) మ‌ల‌యాళీ స్టూడెంట్స్‌. ఇంజ‌నీరింగ్ చ‌ద‌వ‌డానికి కేర‌ళ నుంచి బెంగ‌ళూరు వ‌స్తారు. కాలేజీలో సీనియ‌ర్‌ అయిన కుట్టీని ఎదురిస్తారు ముగ్గురు. అజు, శాంత‌న్‌, బీబీపై ప‌గ‌ను పెంచుకున్న కుట్టీ ర్యాగింగ్ పేరుతో ముగ్గురిని దారుణంగా కొడ‌తాడు. బ‌ట్ట‌లు ఊడ‌దీసి చిత్ర‌హింస‌లు పెడ‌తాడు. కుట్టీపై రివేంజ్ తీర్చుకోవ‌డానికి లోక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ రంగా రావు అలియా రంగాతో (ఫ‌హాద్ ఫాజిల్‌) స్నేహం చేస...