Hyderabad, మే 9 -- Aavesham OTT Streaming: మలయాళ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీటీలోకి వచ్చేసింది. స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ మూవీ గురువారం (మే 9) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ లేకపోయినా సడెన్ గా వచ్చేసి సర్‌ప్రైజ్ చేసింది. దీంతో ఫఫా (ఫహాద్ ఫాజిల్) ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.

ఈ ఏడాది వచ్చిన మరో సూపర్ డూపర్ హిట్ మలయాళ మూవీ ఆవేశం. ఈ ఏడాది రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన నాలుగో మలయాళ సినిమా ఇది. ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో రూ.150 కోట్లకుపైగా వసూలు చేసింది. కేరళలోని థియేటర్లలో ఇంకా మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. అయినా మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

గురువారం (మే 9) నుంచి ఆవేశం మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం ...