Hyderabad, ఏప్రిల్ 24 -- Aavesham Box office: మలయాళం ఇండస్ట్రీకి 2024 బాగా కలిసొస్తోంది. ఇప్పటికే ఆ ఇండస్ట్రీ నుంచి భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ది గోట్ లైఫ్ లాంటి సినిమాలు సక్సెస్ కాగా.. ఇప్పుడు ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ కూడా ఆ లిస్టులో చేరింది. ఏప్రిల్ 11న రిలీజైన ఈ సినిమా కేవలం 13 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.

మలయాళం సినిమాలు ఇన్నాళ్లూ కంటెంట్ పరంగా అందరినీ ఆకట్టుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు మాత్రం అడపాదడపా వచ్చేవి. కానీ ఈ ఏడాది మాత్రం బాక్సాఫీస్ దగ్గర కూడా దుమ్మురేపుతున్నాయి. ఒకదాన్ని మించి మరొక సినిమా వసూళ్లు వర్షం కురిపిస్తోంది. తాజాగా ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

ఈ ఘనత సాధించిన 7వ మలయాళం సినిమాగా నిలిచింది. ఈ ఏడు సినిమ...