Hyderabad, మార్చి 10 -- Aaradhya Devi And Ram Gopal Varma Sister Comments: సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రైటర్‌గా రూపొందించిన లేటెస్ట్ తెలుగు చిత్రం శారీ. టూ మచ్ లవ్ కెన్ బీ స్కేరీ అనేది శారీ ట్యాగ్‌లైన్. ఈ సినిమాతో సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ఆరాధ్య దేవి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

ఆరాధ్య దేవితోపాటు సత్య యాదు కూడా నటుడిగా పరిచయం కానున్నాడు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిన శారీ చిత్రానికి గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించారు. ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్‌ వర్మ శారీ సినిమాను నిర్మించారు.

తాజాగా మల్లారెడ్డి ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్స్ కాలేజీలో విద్యార్థులతో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఆర్జీవీ సోదరి విజయతోపాటు ఆరాధ్య దేవి, సత్య యాదు, నిర్మాత రవిశంకర్ వర్మ ఇంటరాక్...